Kodali Nani: ఊసరవెల్లి కంటే తొందరగా చంద్రబాబు రంగులు మార్చగలడు: కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు

  • చంద్రబాబు చెప్పేవన్నీ దొంగ మాటలే
  • ‘ధర్మపోరాటం’ అనే మాట మాట్లాడే అర్హత బాబుకు లేదు
  • బాబుని మోదీ సహా విపక్షనేతలందరూ తిడుతున్నారు
సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పూటకో అబద్ధం చెప్పే చంద్రబాబు ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చగలడని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా అవసరం లేదని, ప్యాకేజ్ కు ఒప్పుకున్న చంద్రబాబుకు ‘ధర్మపోరాటం’ అనే మాట మాట్లాడే అర్హత లేదని అన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ దొంగమాటలని, బాబుని ప్రధాని మోదీతో పాటు ఏపీలోని విపక్షనేతలందరూ తిడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, సోనియా గాంధీ కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించారని కొడాలి నాని ఆరోపించారు.
Kodali Nani
Chandrababu

More Telugu News