రాజమహేంద్రవరం చేరుకున్న నితిన్ గడ్కరీ
- కాసేపట్లో పోలవరంకు గడ్కరీ
- చంద్రబాబుతో కలిసి ప్రాజెక్టు పరిశీలన
- అధికారులతో సమీక్ష
సుమారు పది నెలల తర్వాత గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. కాగా, మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గడ్కరీ వచ్చే హెలిప్యాడ్ వద్దకు వెళ్లాలని చూసిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తమను అనుమతించాలని వారు ఆందోళనకు దిగారు. పాస్లు ఉన్నవారినే పంపుతామని పోలీసులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.