Rajasthan: ఓ వైపు ప్రమాదంలో చావుబతుకుల మధ్య బాధితులు... మరోవైపు వారితో సెల్ఫీలు.. ఫొటోలు వైరల్‌!

  • రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఘటన
  • సమయానికి ఆసుపత్రికి తరలించని వైనం
  • ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు వ్యక్తులు 
మనుషుల్లో మానవత్వం మంటకలిసి పోతోంది. సాటి మనిషి ప్రమాదంలో ఉంటే సాయం చేయాల్సింది పోయి.. 'ఎవరేమైపోతే నాకేంటీ? నా దారి నాది' అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు. మరి కొందరు మరింత ముందుకెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారితో కూడా సెల్ఫీలు తీసుకుంటూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లోని బార్మర్‌లో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు వాహనదారులు చావుబతుకుల్లో వుంటే, మరోవైపు కొందరు వారితో సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు బయటకు వచ్చాయి. సమయానికి ఆసుపత్రికి తరలించక పోవడంతో ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.       
Rajasthan
selfies
Road Accident

More Telugu News