kalyan jewellers: దుష్ప్రచారంతో 500 కోట్లు నష్టపోయాం: కల్యాణ్ జువెలర్స్

  • నకిలీ ఆభరణాలు అమ్ముతున్నామంటూ ప్రచారం చేస్తున్నారు
  • ప్రత్యర్థి కంపెనీలే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయి
  • కఠిన చర్యలు తీసుకోండి
తమ సంస్థపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ, దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేరళ హైకోర్టును కల్యాణ్ జువెలర్స్ ఆశ్రయించింది. నకిలీ ఆభరణాలను అమ్ముతున్నామంటూ తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారంతో ఇప్పటికే రూ. 500 కోట్ల మేర నష్టం వాటిల్లందంటూ పిటిషన్ లో పేర్కొంది.

 కువైట్ బ్రాంచ్ లో జరిగిన సాధారణ తనిఖీలకు సంబంధించిన వీడియోలను ఎడిట్ చేసి, అవినీతి నిరోధక దాడులుగా చిత్రీకరించి, తమ బ్రాండ్ ను దెబ్బతీసేలా యూట్యూబ్ ద్వారా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. తమ ప్రత్యర్థి కంపెనీలే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని చెప్పింది. నకిలీ వీడియోలను అప్ లోడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... సోషల్ మీడియాలో నకిలీ వార్తలను అదుపు చేసేందుకు క్రమబద్ధీకరణలను ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
kalyan jewellers
kerala
high court

More Telugu News