amit shah: నీలాంటి టెర్రరిస్టును తమిళగడ్డ రానివ్వదు: అమిత్ షాపై నిప్పులు చెరిగిన తంబీలు

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడు పర్యటన కోసం చెన్నై వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై తమిళ తంబీలు విరుచుకుపడ్డారు. 'గో బ్యాక్ అమిత్ షా' హ్యాష్ ట్యాగ్ తో నెటిజెన్లు నిప్పులు చెరిగారు. ట్వీట్లు, రీట్వీట్లతో ఈ హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండింగ్ అయింది. ఏకంగా 1.30 లక్షల మంది దీని ద్వారా స్పందించారు. ఇండియా ట్విట్టర్ ట్రెండ్స్ లో ఈ హ్యాష్ ట్యాగ్ నెంబర్ 2గా నిలిచింది.

అమిత్ షాపై నెటిజెన్లు చేసిన కామెంట్లు ఈ విధంగా ఉన్నాయి.
  • తమిళగడ్డ సమానత్వానికి ప్రతీక... నీలాంటి టెర్రరిస్టులను ఈ గడ్డ రానివ్వదు.
  • ప్రజాస్వామ్య గ్యాంబ్లర్ ను మేము రానివ్వం.
  • తమిళనాడు అంటే ఇండియా కాదు.
  • ట్యూటికోరిన్ కాల్పులపై నీవు ఎందుకు స్పందించలేదు? జాతీయ పార్టీ అధ్యక్షుడిగా నీకు బాధ్యత లేదా?
  • నోట్ల రద్దు స్కామ్ స్టార్ అమిత్ షా.. గో బ్యాక్

ఇలాంటి వ్యాఖ్యలతో నెటిజెన్లు అమిత్ షాపై తమ కోపాన్ని ప్రదర్శించారు. నెటిజన్ల స్పందనతో తమిళ బీజేపీ నేతలకు ముచ్చెమటలు పట్టాయి.
Go Back to Shorts
amit shah
Tamilnadu
netizens

More Telugu News