paripoornanda swamy: నగర బహిష్కరణ అనంతరం పరిపూర్ణానంద స్పందన

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నగరం నుంచి పరిపూర్ణానందస్వామిని ఆరు నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, నగర బహిష్కరణపై తన అనుచరులు ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. ధర్మాన్ని న్యాయం నిలబెడుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.

రెండు రోజుల పాటు పరిపూర్ణానందస్వామిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు... చివరకు ఆయనపై నగర బహిష్కరణ విధించారు. బహిష్కరణకు సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేశారు. గత నవంబర్ లో రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, నగర బహిష్కరణ విధించామని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. అయితే, నగరం నుంచి ఆయనను ఎటు తరలించారనే విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు.
Go Back to Shorts
paripoornanda swamy

More Telugu News