Chidambaram: చిదంబరం ఇంటిని దోచింది పనివాళ్లే.. పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు!

  • ఆదివారం బయటపడిన దొంగతనం
  • సీసీ కెమెరాల్లో రికార్డు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో పనివారి హస్తం ఉన్నట్టు అనుమానించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వెన్నిల (45), ఆమె సోదరి విజీ (49)లు 15 ఏళ్లుగా చిదంబరం ఇంట్లో పనిచేస్తున్నారు. దొంగతనం జరిగిన రోజు వెన్నిల మొదటి అంతస్తులోని  డబ్బు, నగలు ఉన్న గదిలోకి ప్రవేశించినట్టు సీసీ టీవీ ఫుటేజీలో నమోదైంది. ఫుటేజీ ప్రకారం ఈ దోపిడీ ఆమె పనేనని తేలినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సొత్తు దోచుకున్న అనంతరం ఆమె తన సోదరి విజీకి వాటిని అప్పజెప్పిందని పేర్కొన్నారు.

ఆదివారం చిదంబరం ఇంట్లో జరిగిన దొంగతనం సంచలనం సృష్టించింది. రూ.1.5 లక్షల నగదు, లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలు మాయమైన విషయం తెలిసిందే. 
Chidambaram
Congress
Chennai
Theft

More Telugu News