Swamy pari purnanda: పరిపూర్ణానందను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు.. గుర్తు తెలియని ప్రాంతానికి తరలింపు!

  • ఈ తెల్లవారుజామున అదుపులోకి
  • తరలింపులో పోలీసుల చాకచక్యం
  • కాకినాడ తరలిస్తున్నట్టు సమాచారం
కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందను ఈ తెల్లవారుజామున మూడున్నర గం‌టల సమయంలో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లో గృహ నిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.  శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా పరిపూర్ణానంద డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

పరిపూర్ణానందను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన తరలింపు విషయంలో మీడియా దృష్టిని మళ్లించేందుకు చాకచక్యంగా వ్యవహరించారు. మొత్తం నాలుగు వాహనాల్లో బయలుదేరిన పోలీసులు రెండు వాహనాలను విజయవాడవైపు, మరో రెండు వాహనాలను శ్రీశైలం వైపు మళ్లించారు. దీంతో స్వామి ఏ వాహనంలో ఉన్నారన్న విషయంలో కొంత అయోమయం నెలకొంది. స్వామిని ఎక్కడికి తరలించారన్న విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే పరిపూర్ణానందను కాకినాడకు తరలిస్తున్నట్టు సమాచారం.
Swamy pari purnanda
Telangana
Kathi Mahesh
Kakinada

More Telugu News