Viral Videos: మూడేళ్ల కుమారుడిని.. గిరగిరా తిప్పి ఆటోకేసి కొట్టిన దుర్మార్గపు తండ్రి!

  • హైదరాబాద్‌లో ఘటన
  • మహిళతో పరిచయం పెంచుకుని మోసం చేసిన వ్యక్తి
  • పోలీసులతో మహిళ రావడంతో తన కొడుకుని కొట్టిన వైనం
కుమారుడిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే అతడి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. శివ గౌడ్‌ (40), అనూషలకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే, శివగౌడ్‌ మరో మహిళతో పరిచయం పెంచుకుని ఆమెను మోసం చేశాడు. దీంతో ఆ మహిళ శివపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఫిర్యాదు చేసిన మహిళతో పాటు శివగౌడ్‌ ఇంటికి వచ్చారు. మద్యం మత్తులో ఉన్న శివ పోలీసులను తీసుకుని ఎందుకొచ్చావని ఆ మహిళను బెదిరించాడు.
 
అనంతరం ఇంట్లోకి వెళ్లి తన కుమారుడు రిత్విక్‌ ను తీసుకొచ్చి గిరగిరా తిప్పి అక్కడున్న ఓ ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనతో అందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్య అనూష పెద్దగా కేకలు వేస్తూ రోదించింది. చివరకు అతడి చేతిలోంచి బాలుడిని తీసుకుని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. 
Viral Videos
Hyderabad

More Telugu News