jalilkhan: కన్నా-జగన్-పవన్ ల చరిత్రేంటో ప్రజలకు తెలుసు: ఎమ్మెల్యే జలీల్ ఖాన్

  • పవన్ కల్యాణ్ ఓ దొంగ
  • ప్రధాని మోదీతో పవన్, జగన్ కుమ్మక్కయ్యారు
  • దొంగలతో కలిసి అధికారం కోసం మోదీ ప్లాన్ చేస్తున్నారు
కన్నా లక్ష్మీనారాయణ, జగన్, పవన్ లపై టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ముగ్గురి చరిత్రేంటో ప్రజలకు తెలుసని అన్నారు. ‘పవన్ కల్యాణ్ ఓ దొంగ’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి, ఏం చేశారో అందరికీ తెలుసని విమర్శించారు. ప్రధాని మోదీతో పవన్, జగన్ లు కుమ్మక్కయ్యారని, దొంగలతో కలిసి అధికారం కోసం మోదీ ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను బీజేపీ తుంగలో తొక్కిందని, ఈ హామీలను నెరవేర్చనందుకే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
jalilkhan
Pawan Kalyan

More Telugu News