modi: జగన్ అవినీతి పుత్రుడైతే.. పవన్ 'మోదీకి దత్తపుత్రుడు!: నారా లోకేశ్ సెటైర్లు

  • రాష్ట్రాభివృద్ధికి  చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు
  • అభివృద్ధి పుత్రుడు చంద్రబాబు
  • కర్నూలు జిల్లా పర్యటనలో లోకేశ్
టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ల పై మంత్రి నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఈరోజు ఆయన పర్యటించారు. నాగలాపురం పొలాల్లోని పంట కుంటలను ఆయన పరిశీలించారు. అనంతరం, ఉపాధి కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు అభివృద్ధి పుత్రుడు అయితే, అవినీతి పుత్రుడు జగన్ అని, ప్రధాని మోదీ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అనిఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాదిలో రెండున్నర లక్షల పంట కుంటలు తవ్వి చరిత్ర సృష్టించిన ఘనత తమ ప్రభుత్వానిదని అన్నారు. ఉపాధి పని దినాల సంఖ్యను మరో యాభై రోజులు పెంచాలని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని అన్నారు.
modi
jagan
lokesh

More Telugu News