ఇంకా ప్రారంభమేకాని జియో ఇనిస్టిట్యూట్ కు శ్రేష్ఠతర హోదా... మోదీ సర్కారు తీరుపై విమర్శల వెల్లువ!
- బిట్స్ పిలానీ, మణిపూర్ వర్శిటీల సరసన జియో
- మొదలే కాని విద్యాసంస్థకు ఉన్నత హోదా ఎలా?
- ముఖేష్ అంబానీకి అనుకూలంగా ఎన్డీయే సర్కారు
- కాంగ్రెస్ విమర్శ
దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ, రిలయన్స్ ఫౌండేషన్ కు కేంద్రం అనుకూలంగా ఉందని తేలిపోయిందని, ముఖేష్ అంబానీ, నీతాలకు అనుకూలంగా ఎన్డీయే సర్కారు నడుస్తోందని తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించింది. ఏ ప్రమాణాలను ఆధారంగా తీసుకుని ఈ హోదాను ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా, దీనిపై యూజీసీ (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ - విశ్వవిద్యాలయాల నిధుల సంఘం) స్పందిస్తూ, గ్రీన్ ఫీల్డ్ కేటగిరీలో 11 విద్యాసంస్థలు దరఖాస్తు చేసుకోగా, జియోను ఎంపిక చేసినట్టు వెల్లడించింది.