stock market: ఫుల్ జోష్ లో దలాల్ స్ట్రీట్.. 36 వేల మార్కును అధిగమించిన సెన్సెక్స్!

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు మాంచి జోష్ లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ మరోసారి 36వేల మైలురాయిని దాటింది. మధ్యాహ్నం 11.30 గంటల సమయానికి... సెన్సెక్స్ ఏకంగా 227 పాయింట్లు పెరిగి 36,160 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 67 పాయింట్లు లాభపడి 10,919 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్, హిండాల్కో తదితర కంపెనీల షేర్లు లాభాలను మూటగట్టుకున్నాయి. హెక్సావేర్ టెక్నాలజీస్, డెన్ నెట్ వర్క్స్, పేజ్ ఇండస్ట్రీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 
Go Back to Shorts
stock market
sensex
nifty

More Telugu News