Jagan: వర్షాల కారణంగా ఇంకా ప్రారంభం కాని జగన్ పాదయాత్ర

  • తూ.గో. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • వర్షం తగ్గుముఖం పడితే పాదయాత్ర ప్రారంభయ్యే అవకాశాలు
  • రాయవరంలో నిన్న పర్యటించిన జగన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.  ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీవర్షం కురుస్తోంది. దీంతో, వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ మారే అవకాశం ఉన్నట్టు సమాచారం. వర్షం తగ్గుముఖం పడితే కానీ జగన్ ఈరోజు తన పాదయాత్ర ప్రారంభించే అవకాశాలు లేవని తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జగన్ నిన్న పర్యటించారు.
Jagan
padayatra

More Telugu News