Maharashtra: సెల్ఫీకి ప్రయత్నించిన ముగ్గురమ్మాయిలు... నదిలో పడి ఒకరి మృతి!

  • మహారాష్ట్రలోని పుణెలో ఘటన
  • ఇంద్రాణి నది వద్దకు వెళ్లిన అమ్మాయిలు
  • పట్టుదప్పి నదిలో పడ్డ ముగ్గురు
  • ఇద్దరిని కాపాడిన స్థానికులు
వ్యాహ్యాళికి వెళ్లిన ముగ్గురు అమ్మాయిలు, నది వద్ద సెల్ఫీ దిగేందుకు చేసిన ప్రయత్నం వారిలో ఒకరి ప్రాణాలను హరించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పుణె శివార్లలోని ఇంద్రాణి నది వద్దకు వెళ్లిన యువతులు, సెల్ఫీలు దిగుతూ, పట్టుదప్పి, ఒకరి తరువాత ఒకరు నదిలో పడిపోయారు. అందులో ఇద్దరు పెద్ద రాయిని పట్టుకుని గట్టిగా కేకలు పెట్టగా, అవి విన్న స్థానికులు వారిని రక్షించారు. మరో అమ్మాయి షాలినీ చంద్రబాలన్ (17) నీటిలో పూర్తిగా మునిగి మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాన్ని వెలికితీయించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు తెలిపారు.
Maharashtra
Pune
Indrani
River
Selfy

More Telugu News