Pawan Kalyan: మా ఇద్దరి గమ్యం ఒక్కటే.. 'జనసేన పార్టీ' చిరంజీవి అభిమానుల్లో ఒకరిది!: పవన్‌ కల్యాణ్‌

షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ ఎవరిదో కాదని, మెగాస్టార్‌ చిరంజీవి అభిమానుల్లో ఒకరిదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ, భిన్న మనస్తత్వాలు ఉంటాయని, తన గమ్యం, తన అన్నయ్య గమ్యం ఒక్కటేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌, గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌ సెంటర్‌లో పవన్‌ కల్యాణ్‌ ఈరోజు మెగా అభిమానులతో ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ...  ప్రజల సమస్యలు పరిష్కరించేవారు లేకపోవడంతోనే జనసేన పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. తెలుగు వారందరికీ అండగా నిలబడే పార్టీ జనసేన అని అన్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ నుంచి ప్రతి కళాకారుడు తన మనసుకు దగ్గరైనవారేనని, కళాకారుడు రాజకీయాల్లోకి వస్తే భావోద్వేగాలను అర్థం చేసుకోగలడని వ్యాఖ్యానించారు.  
Go Back to Shorts
Pawan Kalyan
Chiranjeevi
Jana Sena

More Telugu News