Hyderabad: హైదరాబాద్‌లో పవన్‌ ఆత్మీయ సదస్సు.. వేదికపైకి దూసుకొచ్చిన మెగా అభిమానులు

  • గచ్చిబౌలిలో కార్యక్రమం
  • తమను లోపలికి పంపాలని కొందరు ఆందోళన
  • సదస్సులో గందరగోళం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు మెగా అభిమానులతో ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నారు. సంధ్య కన్వెన్షన్‌ సెంటర్‌లో కొనసాగుతోన్న ఈ కార్యక్రమానికి మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే, తమను ముందుగా లోపలికి పంపాలని కొందరు అభిమానులు ఆందోళన చేపట్టడంతో గందరగోళం నెలకొంది. సెక్యూరిటీని దాటుకుని వారంతా వేదికపై ఉన్న పవన్‌ కల్యాణ్‌ వద్దకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. ప్రస్తుతం వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.     

More Telugu News

Hyderabad
Jana Sena
Pawan Kalyan