justin bieber: సూపర్ మోడల్ ను పెళ్లాడబోతున్న జస్టిన్ బీబర్

  • అమెరికన్ సూపర్ మోడల్ హెయిలీ తో ఎంగేజ్ మెంట్
  • ఈ ఏడాది చివర్లో వివాహం జరిగే అవకాశం
  • అంతకు ముందు నటి సెలీనా గోమెజ్ తో ప్రేమాయణం
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కెనెడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అమెరికాకు చెందిన సూపర్ మోడల్ హెయిలీ బాల్డ్విన్ తో గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నాడు. నిన్ననే స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది.

కొంత కాలం క్రితం వరకు హాలీవుడ్ నటి, గాయని సెలీనా గోమెజ్ తో బీబర్ ప్రేమాయణం నడిపాడు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. సెలీనా కంటే ముందు హెయిలీని బీబర్ ప్రేమించాడు. దీంతో, మళ్లీ ఆమె వద్దకే వెళ్లిపోయాడు. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి వివాహం జరిగే అవకాశం ఉంది. 
justin bieber
hailey baldwin
selena gomez
canada
pop singer
hollywood

More Telugu News