amalapuram: పెళ్లికూతురు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పంపింది ఆమె సొంత బావే!

  • కాబోయే వరుడికి వధువు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పంపిన బావ
  • ఉపాధి కోసం కువైట్ వెళ్లిన బాధితురాలి అక్క
  • మరదలిపై కన్నేసిన బావ
తనకు కాబోయే భార్యకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలను చూసి... తెల్లారితే జరగనున్న పెళ్లిని వరుడు రద్దు చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడిలో జరిగింది. అయితే, వధువు సొంత బావే ఆమె మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను పంపినట్టు తేలింది. వృత్తిపరంగా ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ కావడంతో... తన మరదలి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సృష్టించాడు. వాటిని వరుడికి పంపించాడు.

వధువు బావ భార్య ఉపాధి కోసం కువైట్ కు వెళ్లింది. దీంతో అతను మరదలిపై కన్నేశాడు. ఈ క్రమంలో మరదలికి వివాహం కుదిరింది. దీంతో, ఆమెను కూడా సొంతం చేసుకోవాలనే స్వార్థంతో, అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గ్రామ పెద్దలు, పోలీసుల విచారణలో తేలింది.
amalapuram
marriage
morphing
photos
videos

More Telugu News