Pawan Kalyan: ఇంత వయసు వచ్చినా డబ్బు, పదవిపై చంద్రబాబుకు వ్యామోహం తగ్గలేదు: పవన్ కల్యాణ్

  • 2019 ఎన్నికలు ఏపీకి చాలా కీలకం
  • వైసీపీకి భావజాలం లేదు
  • రానున్న ఎన్నికల్లో జనసేనదే విజయం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 65 ఏళ్ల వయసు వచ్చినా డబ్బు, పదవిపై చంద్రబాబుకు వ్యామోహం తగ్గలేదని విమర్శించారు. 2019 ఎన్నికలు ఏపీకి చాలా కీలకమని... రాజకీయరంగంలో ఆర్థిక, సామాజిక విప్లవాన్ని జనసేన తీసుకురాబోతోందని చెప్పారు.

చంద్రబాబు, లోకేష్, జగన్ లు తమ అనుచరులతో కలిసి రావాలని, తాను ఒక్కడినే వస్తానని... ఏ పాలసీపైనైనా డిబేట్ లో కూర్చుందామని... అప్పుడు ఎవరికి ఎంత పరిజ్ఞానం ఉందో తెలుస్తుందని సవాల్ విసిరారు. జనసేనకు భావజాలం పుష్కలంగా ఉందని... వైసీపీకి అది లేదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు.
Pawan Kalyan
janasena
Chandrababu
lokesh
jagan
ysrcp
Telugudesam

More Telugu News