Allu Arjun: పక్కా మాస్ స్టోరీతోనే రావడానికి సిద్ధమైన బన్నీ!

  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ 
  • నిర్మాతలుగా అశోక్ కుమార్ .. బుజ్జి 
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు
మాస్ ఆడియన్స్ లో బన్నీకి విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన తన సినిమాల్లో మాస్ ఆడియన్స్ ను అలరించే అన్ని అంశాలు ఉండేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. మాస్ ఆడియన్స్ ను అలరించడం కోసం ఆయన చేసిన సినిమాలే భారీ విజయాలను సాధించాయి. అందువలన కొత్తదనం కోసం అప్పుడప్పుడు ఆయన ఈ జోనర్లో నుంచి బయటికి వెళ్లినా, మళ్లీ వెంటనే ఈ జోనర్లోకి వచ్చేస్తుంటాడు.

 అలాగే తన తాజా చిత్రం కూడా మాస్ ఎంటర్టైనర్ జోనర్లోనే ఉండేలా ఆయన చూసుకున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్. బన్నీ తన తాజా చిత్రాన్ని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తిస్థాయిలో మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా బన్నీ చూసుకుంటున్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ ను లాక్ చేసేశారు. శానం నాగ అశోక్ కుమార్ .. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 
Allu Arjun
vikram kumar

More Telugu News