ఈ రాజకీయాలు నాకొద్దు: టీఆర్ఎస్ నేత సోమారపు సంచలన ప్రకటన!
- రాజకీయ సన్యాసం తీసుకుంటాను
- పదవులకు రాజీనామా చేస్తా
- ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ
శనివారం నాడు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగగా, సోమారపు వర్గం మూడు స్థానాలను, మేయర్ వర్గం ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి గెలుచుకుంది. అంతకుముందు శుక్రవారం నాడు 41 మంది కార్పొరేటర్లు మేయర్ పై అవిశ్వాసం పెట్టగా, సోమారపు సత్యనారాయణ వెనకుండి అవిశ్వాస తతంగాన్ని నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. గత వారంలో కేటీఆర్ రెండు గ్రూపుల నేతలనూ పిలిచి మాట్లాడినా రామగుండంలో పరిస్థితి మారలేదు. ఈ నేపథ్యంలో పార్టీలో అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన సోమారపు, తాను రాజకీయాలను వదిలేయనున్నానని ప్రకటన చేయడం గమనార్హం.