thailand: ఎట్టకేలకు థాయిలాండ్‌ గుహలోంచి బయటకు.. ఇప్పటివరకు ఆరుగురిని రక్షించిన సహాయక బృందాలు

  • రెండు వారాల క్రితం గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలురు
  • సాహసోపేతమైన మిషన్‌ చేపట్టిన సహాయక బృందాలు
  • మిగిలిన వారు కూడా త్వరలోనే బయటకు..
థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో 12 మంది బాలురు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌ చిక్కుకున్న విషయం తెలిసిందే. రెండు వారాల నుంచి వారు అందులోనే ఉన్నారు. వారిని రక్షించేందుకు సాహసోపేతమైన మిషన్‌ చేపట్టిన సహాయక బృందాలు ఈరోజు ఎట్టకేలకు అందులోని ఆరుగురిని బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన వారిని కూడా త్వరలోనే బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఆ బాలురను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, వెంటనే వైద్య పరీక్షలకు తరలించామని అక్కడి అధికారులు తెలిపారు. ఈరోజు వర్షాలు తగ్గడంతో సహాయక బృందాలు గుహలోకి ప్రవేశించి ఒక్కొక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. గుహలో ఎవరైనా తీవ్ర అస్వస్థతకు గురైతే, వారిని ఆసుపత్రికి తరలించేందుకు తాము ఓ హెలికాప్టర్ ను కూడా సిద్ధం చేసి ఉంచామని తెలిపారు.    
thailand
cave

More Telugu News