ప్రమాదవశాత్తు చేపల చెరువులో పడి యూపీ మాజీ ఎమ్మెల్యే మృతి!
- ఉత్తరప్రదేశ్లో ఘటన
- తన వ్యవసాయ క్షేత్రంలో మార్నింగ్ వాక్కు వెళ్లిన వారిస్ అలీ
- ఈత రాక చెరువులోనే మునిగిపోయిన నేత
ఆయనకు ఈత రాకపోవడంతో నీళ్లల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఆయన 2007లో బీఎస్పీ తరఫున పోటీ చేసి గెలిచి 2012 వరకు నన్పారా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, బీఎస్పీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.