Uttar Pradesh: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేందర్ సింగ్

  • గతంలో ప్రభుత్వ అధికారులను వేశ్యలతో పోల్చిన యూపీ బీజేపీ నేత
  • తాజాగా అత్యాచారాలపై సంచలన వ్యాఖ్యలు
  • సమాజంలో అత్యాచారాలు భాగమైపోయాయని వ్యాఖ్య
పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కుతోన్న బీజేపీ ఉత్తరప్రదేశ్‌ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు కూడా అత్యాచార ఘటనలను ఆపలేడని ఆయన అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమాజంలో అత్యాచారాలు భాగమైపోయాయని, తాను చెప్పదలుచుకున్నది ఒక్కటేనని, సమాజంలో అందరూ బాధ్యతగా వ్యవహరించగలగాలని అన్నారు.

ఆయన గతంలో ప్రభుత్వ అధికారులను వేశ్యలతో పోల్చారు. వేశ్యలు డబ్బులు తీసుకుని డ్యాన్స్‌ చేసి ఆనందపరుస్తారని, ప్రభుత్వ అధికారులు మాత్రం డబ్బులు తీసుకున్నా పని చేయడం లేదని అన్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.          
Uttar Pradesh
BJP

More Telugu News