Nara Lokesh: పేద ప్రజలు సరైన ఇళ్లు లేకుండా రోడ్ల పైనే ఉండాలని బీజేపీ, వైసీపీ కోరుకుంటున్నాయి: లోకేశ్‌

  • నలుగురు ఉండటానికి ‌జగన్‌ ప్యాలెస్‌లు కట్టుకున్నారు
  • పేదలకు ఇళ్లు కట్టిస్తోంటే ఎందుకని ప్రశ్నిస్తున్నారు
  • పేదవారిని కించపరిచేలా మాట్లాడడం దురదృష్టకరం
నలుగురు కుటుంబ సభ్యులు ఉండటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి కోట్లాది రూపాయలతో ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే అంత నాణ్యమైన ఇళ్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఆయన పేదవారిని కించపరిచేలా మాట్లాడడం దురదృష్టకరమని, బీజేపీ, వైసీపీలు పేదవారికి నాణ్యమైన ఇళ్లు కట్టకూడదని కంకణం కట్టుకున్నాయని ట్వీట్‌ చేశారు.

పేద ప్రజలు సరైన ఇళ్లు లేకుండా రోడ్ల పైనే ఉండాలని వారు కోరుకుంటున్నారని, కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదవారికి ధనికులు ఉండే ఇళ్లతో సమానంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని ఆపబోమని నారా లోకేశ్‌ పేర్కొన్నారు.
Nara Lokesh
Telugudesam
BJP
YSRCP

More Telugu News