Hyderabad: హైదరాబాద్‌లో ఐదో అంతస్తు పై నుంచి పడి 14 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి!

  • అల్వాల్‌ జేజే నగర్‌లో ఘటన
  • నిన్న సాయంత్రం అమ్మమ్మ ఇంటికి బాలిక వర్ష
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లోని అల్వాల్‌ జేజే నగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల వర్ష అనే బాలిక ఓ భవనం ఐదో అంతస్తు పై నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు స్కూలుకి సెలవు కావడంతో నిన్న సాయంత్రం వర్ష తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. వర్ష అనుమానాస్పద మృతి ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.   
Hyderabad
Police

More Telugu News