philliphines: ఎవరైనా సరే ఇది నిరూపిస్తే.. నా పదవికి రాజీనామా చేస్తా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డ్యుటెరెట్

  • దేవుడనే వాడు ఉన్నట్టు కనీసం ఒక్క ఆధారమైనా చూపించాలి
  • దేవుడితో ఎవరైనా మాట్లాడినట్టు, చూసినట్టు ఓ సెల్ఫీ తీసుకురండి
  • అలా చేస్తే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా
‘డ్రగ్స్ సరఫరా చేసే వారు కనిపిస్తే కాల్చేయండి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెరెట్ మరోసారి వార్తల్లో నిలిచారు. అసలు, దేవుడనే వాడు ఉన్నట్టుగా కనీసం ఒక్క ఆధారమైనా చూపించాలని, దేవుడితో ఎవరైనా మాట్లాడినట్టు, చూసినట్టు ఓ సెల్ఫీ తీసుకుని వస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘దేవుడు’ అనే లాజిక్ ఎక్కడ ఉంది? అసలు, ఈ పదానికి అర్థమేంటని ప్రశ్నించారు. దేవుడు ఉన్నాడనే భావన చాలా మూర్ఖమైనదని తన దైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. కాగా, దావో నగరంలో శాస్త్ర సాంకేతికతపై నిన్న నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
philliphines
rodrigo

More Telugu News