ashok gajapati raj: అశోక్ గజపతి రాజు గారు... ఓకే మీరు రాజులు.. సంస్థానాధీశులు!: ‘జనసేన’ అధినేత పవన్
- విశాఖలో ‘జనసేన’ నిరసన కవాతు
- అశోక్ గజపతిరాజు గురించి నేను ఒకమాట కూడా అనలేదు
- స్పెషల్ స్టేటస్ గురించి మాత్రమే నేను అడిగా
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనే లక్ష్యంగా విశాఖపట్టణంలో జనసేన పార్టీ నిరసన కవాతు జరిగింది. స్థానిక ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి ఉడా పార్క్ వరకు ఈ కవాతు కొనసాగింది. ఈ కవాతులో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘టీడీపీ నేతలు బరువు తగ్గడం కోసం నిరాహారదీక్షలు చేస్తారట.. నిరాహారదీక్షలంటే వాళ్లకు అంత వెటకారంగా ఉంది.
అశోక్ గజపతి రాజు గారి గురించి... ఓకే మీరు రాజులు, సంస్థానాధీశులు, పెద్దవాళ్లు..నేనేమీ కాదనను.. గౌరవిస్తాను. నేను సామాన్యుడిని.. ఓ చిన్నపాటి కానిస్టేబుల్ కొడుకుని. నేను అశోక్ గజపతిరాజు గురించి ఒకమాట కూడా అనలేదు. కేవలం, స్పెషల్ స్టేటస్ గురించి మాత్రమే నేను అడిగితే.. వాడెవడో పవన్ కల్యాణ్.. యాక్టరా..వాడెవడో నాకు తెలియదు’ అని అశోక్ గజపతిరాజు అన్నారు. అయినా, నాకేమీ ఇబ్బందిలేదు... నేను భరిస్తా. నేను ఉద్దానంలో నిరాహారదీక్ష చేస్తే.. రిసార్ట్ లో నిరాహారదీక్ష చేశానని అశోక్ గజపతిరాజు అన్నారు. అందరిముందు కూర్చుని నేను నిరాహారదీక్ష చేశా...రిసార్ట్ లో కాదు. మీకు (అశోక్ గజపతిరాజు) అది కనిపించకపోతే.. నేనేమీ చేయను’ అని విమర్శించారు.