kakani govardhan: స్వచ్ఛ భారత్ అవార్డు అందుకున్న కలెక్టర్ కు అవినీతి కనిపించడం లేదా?: వైసీపీ ఎమ్మెల్యే కాకాణి

  • మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగింది
  • కలెక్టర్ అవినీతికి పాల్పడ్డారని నేను అనడం లేదు
  • పారదర్శకంగా వ్యవహరించాలని మాత్రమే అడిగా
నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుపై వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికార టీడీపీకి జిల్లా కలెక్టర్ కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం తప్పా? అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు జిల్లాపరిషత్ ఛైర్మన్ గా పని చేసిన తనకు అధికారులను ఎలా గౌరవించాలో తెలుసని... మరొకరు చెబితే తెలుసుకునే పరిస్థితిలో లేనని అన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందని... స్వచ్ఛ భారత్ అవార్డు అందుకున్న కలెక్టర్ కు ఇవి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కలెక్టర్ అవినీతికి పాల్పడ్డారని తాను అనడం లేదని... పాలన గాడి తప్పిందని మాత్రమే విమర్శిస్తున్నామని చెప్పారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలంటూ కలెక్టర్ ను ఓ ప్రజాప్రతినిధిగా అడగడం తప్పా? అని అన్నారు. 
kakani govardhan
nellore
collector

More Telugu News