jagan: వైయస్ హయాంలో ఆటో కార్మికులు ఎన్నడూ బాధపడలేదు: భూమన

  • ప్రతి ఆటో కార్మికుడికి 10 వేలు ఇస్తామని జగన్ చెప్పారు
  • ఇచ్చిన మాటను జగన్ తప్పరు
  • ఆటో యూనియన్ సమావేశంలో భూమన భరోసా
ముఖ్యమంత్రి కాగానే ఆటో కార్మికులను ఆదుకుంటానని, ప్రతి ఆటో కార్మికుడికి రూ. 10వేలు ఇస్తామని జగన్ ప్రకటించారని... ఇచ్చిన మాటను ఆయన తప్పరని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైయస్ హయాంలో ఆటో కార్మికులు ఎన్నడూ ఇబ్బందులు పడలేదని... చంద్రబాబు పాలనలో ఆటో కార్మికులను పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో ఈరోజు వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సమావేశమైంది. ఈ సమావేశానికి భూమన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆటో కార్మికులకు భరోసా ఇచ్చారు.
jagan
auto
bhumana

More Telugu News