law commission: జాతీయ లా కమిషన్ సమావేశానికి దూరంగా ఉండాలంటూ టీడీపీ నిర్ణయం

  • జమిలి ఎన్నికలపై పార్టీల అభిప్రాయ సేకరణ 
  • అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తున్న టీడీపీ
  • సమావేశానికి హాజరవుతున్న పలు పార్టీలు
కీలకమైన జాతీయ లా కమిషన్ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలను టీడీపీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన సమస్యలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం... ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపుతుండటాన్ని టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి.

ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు హాజరవుతున్నాయి. ఈ సందర్భంగా లా కమిషన్ ఎదుట జమిలి ఎన్నికలకు సంబంధించి తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి. దీని కోసం పార్టీలకు నేడు, రేపు సమయాన్ని కమిషన్ కేటాయించింది. దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలను కమిషన్ తీసుకోనుంది. 
law commission
meeting
Telugudesam

More Telugu News