Kamal Haasan: వివాదంలో ‘శభాష్ నాయుడు’ చిత్రం టైటిల్.. మార్చేది లేదంటున్న కమలహాసన్!

  • ‘శభాష్ నాయుడు’ ‌టైటిల్‌పై కమల్‌కు బెదిరింపులు
  • పేరు మార్చకుంటే అడ్డుకుంటామని హెచ్చరిక
  • ఏం చేసుకుంటారో చేసుకోండన్న కమలహాసన్!
విలక్షణ నటుడు కమలహాసన్ తాజాగా చేస్తున్న చిత్రం ‘శభాష్ నాయుడు’ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం టైటిల్ లోని 'నాయుడు' పదం తమ సామాజిక వర్గం మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని, వెంటనే దానిని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టైటిల్ మార్చకుండా విడుదల చేస్తే అడ్డుకుంటామని బెదిరిస్తున్నారట. అయితే, వారి బెదిరింపులకు లొంగని కమల్.. సినిమా టైటిల్ మార్చే ప్రసక్తే లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండని తెగేసి చెప్పేశాడని ప్రచారం జరుగుతోంది. కమల్ కుమార్తె శ్రుతిహాసన్, హాస్యనటుడు బ్రహ్మానందం ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కమల్ సినిమాలు విడుదలకు ముందు వివాదం కావడం ఇటీవల ఎక్కువైంది. వివాదాల్లోకి వెళ్లకుండా ఆయన సినిమాలు విడుదల కావడం లేదు. గతంలో ‘విశ్వరూపం’ విషయంలోనూ వివాదం నెలకొంది. ఇప్పుడు కమల్ ‘విశ్వరూపం 2’ చేస్తున్నారు. ఇక 40 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘శభాష్ నాయుడు’ మిగిలిన షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది.  
Kamal Haasan
Sabhash Naidu
Movie

More Telugu News