ram vilas paswan: మహాకూటమిలో చేరికపై పాశ్వాన్ స్పందన

  • మహాకూటమిలో పాశ్వాన్ చేరుతున్నారంటూ వార్తలు
  • ఆర్జేడీతో పాశ్వాన్ సంప్రదింపులు జరుపుతున్నారన్న రఘువంశ్ ప్రసాద్
  • అన్నీ ఊహాగానాలే అంటూ కొట్టిపారేసిన పాశ్వాన్
ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమిలో లోక్ జనశక్తి పార్టీ చేరబోతోందనే వార్తలపై ఆ పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ స్పందించారు. అవన్నీ ఊహాగానాలే అని ఆయన కొట్టిపారేశారు. పాశ్వాన్ అల్లుడు, దళిత సేన అధ్యక్షుడు అనిల్ కుమార్ సాధు గత మార్చిలో ఆర్జేడీలో చేరారు. ఈ నేపథ్యంలో మహాకూటమిలో పాశ్వాన్ కూడా చేరబోతున్నారనే వార్తలు వెల్లువెత్తాయి. దీనికితోడు ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ నేతలతో పాశ్వాన్ సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మహాకూటమిలో పాశ్వాన్ చేరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై పాశ్వాన్ స్పందిస్తూ, తనకు అలాంటి ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. 
ram vilas paswan
rjd

More Telugu News