saidharam tej: ఇకపై చిరూ సాంగ్స్ ను రీమిక్స్ చేయను: తేజు

  • చిరంజీవిని అనుకరిస్తోన్న తేజు 
  • ఎక్కువవుతోన్న విమర్శలు 
  • మనసు మార్చుకున్న తేజు
మొదటి నుంచి కూడా సాయిధరమ్ తేజ్ డాన్సులలోను .. డైలాగ్ డెలివరీలోను చిరంజీవిని అనుకరిస్తూ వస్తున్నాడు. అంతేకాదు చిరంజీవి కెరియర్లో విశేషమైన ఆదరణ పొందిన పాటలను తన సినిమాల్లో రీమిక్స్ చేస్తూ వస్తున్నాడు. ఇది తేజుకి ఎంతవరకు కలిసొచ్చిందనే విషయాన్ని పక్కన పెడితే, విమర్శలు ఎక్కువవుతూ వస్తున్నాయి.

 తాజాగా ఒక సందర్భంలో తేజు మాట్లాడుతూ .. "ఇకపై చిరంజీవి గారి సాంగ్స్ ను రీమిక్స్ చేయను. ఇంతవరకూ చేసిన రీమిక్స్ సాంగ్స్ కి కూడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చింది. చిరంజీవిగారి సాంగ్స్ ను రీమిక్స్ చేయడం నాక్కూడా ఇబ్బందిని కలిగిస్తోంది. ఎందుకంటే స్టెప్స్ తో ఆయన అదరగొట్టేసిన పాటల్లో మరో హీరోను చూడటం ఆడియన్స్ కి ఇష్టం ఉండకపోవచ్చు. అందువలన ఇక రీమిక్స్ సాంగ్స్ ఆలోచనను దూరం పెట్టేస్తున్నాను" అన్నాడు. ఆయన తాజా చిత్రమైన 'తేజ్ ఐ లవ్ యూ' ఈ రోజునే థియేటర్లకు వచ్చిన సంగతి తెలిసిందే.        
saidharam tej

More Telugu News