ram madhav: బీజేపీ ఎమ్మెల్యేల మగతనం ఏమిటో ఇప్పటికే తేలిపోయింది: జీవన్ రెడ్డి

  • రామ్ మాధవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి
  • సంఘ్ లో పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి?
  • తెలంగాణలో కమలం ఎప్పుడో వాడిపోయింది
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ఎక్కువవుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మగతనం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల మగతనం ఏమిటో గత ఎన్నికల్లోనే తేలిపోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కించపరిచే విధంగా మాట్లాడినందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వెంటనే రామ్ మాధవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంస్కారహీనంగా రామ్ మాధవ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సంఘ్ లో పనిచేశానని చెప్పుకునే ఓ వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కమలం ఎప్పుడో వాడిపోయిందని... రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఘోర అవమానం తప్పదని అన్నారు. 
ram madhav
bjp
jeevan reddy
TRS

More Telugu News