Hyderabad: జగన్ అక్రమాస్తుల కేసులో నేటి విచారణకు హాజరైన పలువురు వీఐపీలు!

  • నాంపల్లి కోర్టులో విచారణ
  • హాజరైన సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి తదితరులు
  • విచారణ తరువాత తిరిగి తూ.గో జిల్లాకు జగన్
వైకాపా అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ, నాంపల్లి సీబీఐ, ఈడీ కోర్టులో నేడు సాగుతుండగా, విచారణకు పలువురు వీఐపీలు హాజరయ్యారు. తన పాదయాత్రకు విరామం ఇచ్చి, నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్న వైఎస్ జగన్ తో పాటు, వైకాపా ఎంపీ, విజయసాయిరెడ్డి, మాజీ హోమ్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, ఎన్ శ్రీనివాసన్ తదితరులు హాజరయ్యారు. కాగా, ఈ కేసు విచారణ అనంతరం, సాయంత్రం నుంచి జగన్ తన పాదయాత్రను కొనసాగించే నిమిత్తం తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు ప్రయాణం కానున్నారు.
Hyderabad
Nampalli Court
CBI
Hearing
Jagan

More Telugu News