Punjab: తాను ఏర్పాటు చేసిన సమావేశానికి రాని మహిళా ఐపీఎస్ పై బదిలీ వేటు వేయించిన హర్యానా మంత్రి!

షార్ట్స్‌లో చూడండి
తాను నిర్వహించిన ఓ సమావేశానికి రాలేదని, తనను కలవలేదన్న ఆగ్రహంతో ఉన్న హర్యానా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్, పానిపట్ జిల్లా మహిళా ఎస్పీ సంగీతా కాలియాపై బదిలీ వేటు వేయించారు. గత నెల 30న ఆయన పానిపట్ అధికారులతో ఓ సమావేశం నిర్వహించగా, దానికి సంగీత హాజరు కాలేదు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కు ఫిర్యాదు చేశారు. తాను ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ సమావేశానికి, ఆమె రాలేదని ఆరోపించారు. దీంతో ఆమెను అంతగా ప్రాధాన్యం లేని గురుగ్రామ్ బోండ్సీలోని ఫస్ట్ ఇండియా రిజర్వ్ బెటాలియన్ కమాండర్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సంగీతను అనిల్ విజ్ బదిలీ చేయించడం ఇది తొలిసారేం కాదు. మూడేళ్ల క్రితం నవంబర్ 2015లో ఓ సమావేశంలో అనిల్ విజ్ తో సంగీత వాగ్వాదానికి దిగగా, అప్పుడు కూడా బదిలీ చేయించారు.
Go Back to Shorts
Punjab
Minister
Anil Viz
Sangeeta Kiliya
Transfer

More Telugu News