tarak: అన్న కల్యాణ్ రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఎన్టీఆర్

  • నానాటికీ బలపడుతున్న అన్నదమ్ముల అనుబంధం
  • అన్నయ్య పుట్టినరోజును సెలబ్రేట్ చేసిన తారక్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ల అనుబంధం రోజురోజుకూ బలపడుతోంది. ఒకరి బర్త్ డేను మరొకరు సెలబ్రేట్ చేయడం, ఒకరి ఈవెంట్లకు మరొకరు వెళ్లడం పరిపాటిగా మారింది. తాజాగా అన్న కల్యాణ్ రామ్ పుట్టినరోజును జూనియర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. అన్నయ్యతో కేక్ కట్ చేయించాడు. ఆప్యాయంగా కేక్ ను తినిపించాడు. ఈ కార్యక్రమానికి తారక్ పెద్ద కుమారుడు అభయ్ కూడా హాజరయ్యాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం తారక్ తన తాజా చిత్రం 'అరవింద సమేత' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం... దసరా సందర్భంగా విడుదల కానుంది. మరోవైపు, తన 16వ ప్రాజెక్ట్ ను కేవీ గుహన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు కల్యాణ్ రామ్.
tarak
ntr
kalyan ram
birthday

More Telugu News