Ananth kumar: అంతరాత్మ గురించి వారికేం తెలుసు: కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే

  • అంతరాత్మను మేధావులు అర్థం చేసుకోలేరు
  • మనిషికి, శవానికి వారికి తేడా తెలియదు
  • వైరల్ అవతున్న మంత్రి ట్వీట్
కేంద్రమంత్రి అనంత్‌ కుమార్ హెగ్డే చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మేధావులుగా సమాజంలో చలామణి అవుతున్న వారికి బతికున్న మనిషికి, శవానికీ తేడా తెలియదని అందులో పేర్కొన్నారు. వారికి అంతరాత్మ గురించి తెలియదని ఎద్దేవా చేశారు. జీవమున్న మనుషుల్లోనూ, శవాల్లోనూ అవే అవయవాలు ఉంటాయని వారు అనుకుంటారని అన్నారు.

జీవితం అంటే శరీరాన్ని సుఖపెట్టడమేనని మేధావులు భావిస్తారని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ వైరల్ అయింది. ట్విట్టర్ యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు యూజర్లు మంత్రి చెప్పిన దానిని అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉందని పేర్కొనగా, మరికొందరు మంత్రి వ్యాఖ్యలకు, బురారీ సామూహిక ఆత్మహత్యలకు ఏమైనా సంబంధం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
Ananth kumar
Minister
Karnataka
Tweet

More Telugu News