Sanju: రికార్డులు తిరగరాస్తున్న 'సంజు' నచ్చలేదంటున్న త్రిషాలా దత్!

  • గత వారం విడుదలైన 'సంజు'
  • సినిమాలో మొదటి భార్య రిచా శర్మ పాత్ర పరిమితం
  • అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న త్రిషాలా దత్
గత వారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాలీవుడ్ హీరో సంజయ్ దత్ బయోపిక్ 'సంజు' రికార్డులను తిరగరాస్తుంటే, ఆ సినిమా తనకు నచ్చలేదని అంటోంది సంజయ్ దత్ కుమార్తె త్రిషాలా దత్. సంజయ్ జీవితంలో ఎంతో ప్రాధాన్యమున్న తన తల్లి పాత్రను ఈ చిత్రంలో చాలా తక్కువగా చూపించారన్నది ఆమె అభిప్రాయమట. అందుకే ఈ సినిమా తనకు నచ్చలేదని త్రిషాలా తన సన్నిహితుల వద్ద చెప్పి బాధపడినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో రిచా శర్మను సంజయ్ మొదటి భార్యగా చూపించారు. సినిమాలో ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువ. రిచాశర్మతో విడిపోయిన తరువాత సంజయ్ దత్, మాన్యతను వివాహం చేసుకున్నాడు. మాన్యతతో త్రిషాలాకు ఎలాంటి విభేదాలూ లేనప్పటికీ, తన తల్లి పాత్రను ఇంకాస్త చూపించి వుంటే బాగుండేదన్నది త్రిషాలా అభిప్రాయమట.
Sanju
Sanjay Dutt
Trishala
Richa Sharma

More Telugu News