ntr: ‘యన్.టి.ఆర్’ చిత్రం ఫస్ట్ డే..ఫస్ట్ షాట్ ఇది: దర్శకుడు క్రిష్

  • ఈ చిత్రం షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం
  • ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలకృష్ణ  పోస్టర్  
  • ఎంతో యంగ్ గా కనిపిస్తున్న బాలయ్య

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రను ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ విషయాన్ని క్రిష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలకృష్ణ  పోస్టర్ ను పోస్ట్ చేశారు. ఈ పోస్టర్ లో ఎంతో యంగ్ గా బాలకృష్ణ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ లో ఓ వైపు బాలయ్య ఫొటో ఉండగా, మరోవైపు ఎన్టీఆర్ నాడు తన డైరీలో రాసుకున్న ఓ పేజీని ఉంచారు.

‘అభిమానమును మించిన ధనము; ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా బుణపడ్డట్టే!...’ అని 1975వ సంవత్సరంలో ఎన్టీఆర్ తన డైరీలో రాసుకున్న ఓ పేజీని ఈ పోస్టర్ లో ఓ వైపు ఉంచారు. కాగా, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనుంది. ఈ చిత్రాన్ని 2019 జనవరి 9న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్టు సమాచారం.

More Telugu News