ramakrishna: రేపు ఏపీ వ్యాప్తంగా జనసేన, వామపక్ష పార్టీల నిరసన ర్యాలీలు: సీపీఐ రామకృష్ణ

  • సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్‌కు నిరసన
  • ఏపీకి కేటాయింపుల అంశంపై తప్పుడు సమాచారం ఇచ్చింది
  • రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుందాం 
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలుపై సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్‌కు నిరసనగా రేపు జనసేన, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి కేటాయింపుల అంశంపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునేందుకు పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, కేంద్ర సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్‌పై టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.     
ramakrishna
Jana Sena
Andhra Pradesh

More Telugu News