sonali bindrey: సోనాలి బింద్రేను కలిసి ధైర్యం చెప్పిన హీరో అక్షయ్ కుమార్

  • న్యూయార్క్ లో కేన్సర్ చికిత్స పొందుతున్న సోనాలికి పరామర్శ
  • సోనాలి ధైర్యంగా పోరాడుతుందని నాకు తెలుసు
  • దేవుడి దీవెనలతో మంచి ఆరోగ్యంతో ఆమె తిరిగి వస్తుంది: అక్షయ్
తనకు హై గ్రేడ్ కేన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయిందని, వైద్యుల సూచన మేరకు న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్నానని ప్రముఖ నటి సోనాలి బింద్రే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, వెకేషన్ నిమిత్తం ప్రస్తుతం న్యూయార్క్ లో వున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. సోనాలిని కలిసి పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ మాట్లాడుతూ, సోనాలి ధైర్యంగా పోరాడుతుందని తనకు తెలుసని అన్నారు. దేవుడి దీవెనలతో మంచి ఆరోగ్యంతో ఆమె తిరిగి రావాలని కోరుకున్నారు. 
sonali bindrey
akshay kumar

More Telugu News