kumaraswamy: కర్ణాటక ప్రజలపై 'పెట్రో' బాంబు విసిరిన కుమారస్వామి!

  • తొలి బడ్జెట్టుతో కన్నడిగులకు షాక్ 
  • లీటర్ పెట్రోల్ పై రూ. 1.14, డీజిల్ పై రూ. 1.12 పెంపు 
  • రూ. 34 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ  
ముఖ్యమంత్రిగా తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన కుమారస్వామి రాష్ట్ర ప్రజలకు షాక్ ఇచ్చారు. కన్నడిగులపై పెట్రో బాంబు విసిరారు. పెట్రోల్ పై పన్ను రేటును 30 శాతం నుంచి 32 శాతం వరకు... డీజిల్ పై 19 శాతం నుంచి 21 శాతం వరకు పెంచబోతున్నట్టు తెలిపారు. దీని కారణంగా లీటర్ పెట్రోల్ పై రూ. 1.14, లీటర్ డీజిల్ పై రూ. 1.12 వరకు పెరుగుతుందని ప్రకటించారు. మరోవైపు రూ. 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులకు మేలు జరిగేలా... రూ. 34 వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేయబోతున్నట్టు కుమారస్వామి వెల్లడించారు.
kumaraswamy
budget
petrol
diesel
rates

More Telugu News