r swamy naidu: జనసేనలో చేరనున్న చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు.. భారీ సంఖ్యలో మెగా అభిమానులు కూడా!

  • జనసేనలో చేరనున్న ఆర్.స్వామినాయుడు
  • మూడు రోజుల క్రితం చిరంజీవితో చర్చలు
  • పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వేలాది కాంగ్రెస్ కార్యకర్తలు
దశాబ్దాలుగా చిరంజీవి యువతకు సారథ్యం వహిస్తున్న ఆర్.స్వామినాయుడు ఈనెల 9న జనసేనలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో, ఛలో హైదరాబాద్ పేరిట భారీ ఎత్తున చిరంజీవి అభిమానులు తరలి వచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. అదే రోజు ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు (చిరంజీవి అభిమానులుగా ఉన్నవారు) జనసేనలో చేరనున్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలో వీరంతా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, క్రియాశీలక రాజకీయాలకు చిరంజీవి దూరమైన నేపథ్యంలో, ఆయన అభిమానులు జనసేనలో చేరడానికి సిద్ధమవుతుండటం కీలక పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితమే జనసేనలో చేరికకు సంబంధించి చిరంజీవితో స్వామినాయుడు చర్చించారు.

చిరంజీవి యువతకు చెందిన క్యాడర్ మొత్తం జనసేనలోకి చేరబోతోంది. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా, వీరందరినీ ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. చిరంజీవి యువత కేడర్ కు ప్రాధాన్యతను ఇచ్చేందుకు పవన్ ఒప్పుకున్నట్టు సమాచారం. మరోవైపు, ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న స్వామినాయుడు నేడు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉన్నారు.  
r swamy naidu
chiranjeevi yuvatha
Pawan Kalyan
janasena

More Telugu News