pawan kalyan: పిచ్చిపిచ్చి వేషాలు వేయకండి: టీడీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్

  • టీడీపీ నేతలు పైనుంచి దిగొచ్చారా?
  • దోపిడీ చేస్తామంటే.. చూస్తూ ఊరుకోం
  • ఒక్క సంతకంతో ప్రజల తలరాతలు మార్చేస్తున్నారు
టీడీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా పైనుంచి దిగొచ్చారా? వాళ్లకు మేమేమైనా బానిసలమా? అని ప్రశ్నించారు. ప్రజాసేవ కోసం వచ్చినవారు, రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అల్లుడు ఎవరైనా సరే పరిధికి లోబడే ఉండాలని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తామంటే... చేతులు కట్టుకుని కూర్చోబోమని... పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని హెచ్చరించారు.

అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని... పోతే ప్రాణాలే పోతాయని ధైర్యంగా అడుగువేశానని పవన్ చెప్పారు. రాజకీయ నాయకులు తలచుకుంటే ఒక్క సంతకంతో తలరాతలు మార్చేయవచ్చని తెలిపారు. తెలంగాణలో ఓ పెన్ను పోటుతో ఉత్తరాంధ్రకు చెందిన 23 వెనుకబడిన కులాలను జాబితా నుంచి తొలగించారని... అదే విధంగా ఏపీలో టీడీపీ నేతల సంతకాలతో ప్రజల తలరాతలు మారిపోతున్నాయని చెప్పారు. మౌనంగా చూస్తూ కూర్చుంటే విశాఖలోని డాల్ఫిన్ కొండలను కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకుంటారని అన్నారు. తప్పు చేస్తున్నవారిని తానెందుకు ప్రశ్నించకూడదని నిలదీశారు. 
pawan kalyan
Telugudesam

More Telugu News