ntr: వరంగల్ పరిసర ప్రాంతాల్లో 'అరవింద సమేత . .' షూటింగ్

  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 
  • 50 శాతం చిత్రీకరణ పూర్తి 
  • కథానాయికగా పూజా హెగ్డే
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రూపొందుతోంది. కథా పరంగా .. పాత్రల పరంగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోను .. రాయలసీమ ప్రాంతంలోను .. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో జరగవలసి వుంది. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసేశారు. నెక్స్ట్ షెడ్యూల్ షూటింగును వరంగల్ పరిసర ప్రాంతాల్లో జరపవలసి ఉందట. అందువలన వరంగల్ లో ఉంటూ అక్కడి పరిసర ప్రాంతాలను త్రివిక్రమ్ చూసి వస్తున్నాడట. ఆయనకి నచ్చిన లొకేషన్స్ లో కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ ను కూడా చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' ఫలితంతో నిరాశకి లోనైన త్రివిక్రమ్, 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నాడు.    
ntr
pooja hegde

More Telugu News