nara lokesh: జీవీఎల్ గారూ.. గుడ్ మార్నింగ్: నారా లోకేష్ సెటైర్

  • అగ్రిమెంట్లపై సంతకాలు చేస్తూ బిజీగా ఉన్నా
  • ఏవో పేర్లు వెల్లడిస్తానని చెప్పారు
  • ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు?
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును ఉద్దేశించి ఏపీ మంత్రి నారా లోకేష్ సెటైరిక్ గా ట్వీట్ చేశారు. "జీవీఎల్ గారూ, గుడ్ మార్నింగ్. నేను స్పందించడానికి 36 గంటలు పట్టింది. ఇన్వెస్ట్ మెంట్లకు సంబంధించిన అగ్రిమెంట్లపై సంతకాలు చేయడంలో నేను బిజీగా ఉండటమే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకుండానే ఇవన్నీ మేము చేస్తున్నాం. ఏవో పేర్లు బయటపెడతానని చెప్పారు. ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? మీరు పేర్లు ప్రకటించే ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఎదురు చూస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు. 
nara lokesh
gvl narasimharao

More Telugu News