Karnataka: బెంగళూరులోని ప్రముఖ పబ్ పై దాడులు... 32 మంది అమ్మాయిలు అదుపులోకి!

  • ఇందిరానగర్ లోని పబ్ లో అశ్లీల నృత్యాలు
  • పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు
  • ఆరుగురు పురుషులు అరెస్ట్
బెంగళూరులో పబ్బులు, నైట్ క్లబ్ లు, రెస్టారెంట్లు అధికంగా ఉండే ఇందిరానగర్ పరిధిలోని 80 ఫీట్ రోడ్ లో ఉన్న ఓ పబ్బుపై దాడి చేసిన పోలీసులు 32 మంది అమ్మాయిలను, ఆరుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బెంగళూరు డిప్యూటీ కమిషనర్ అజయ్ హిలోరీ వెల్లడించారు. పబ్బు నిర్వాహకులపై కేసులు పెట్టామని తెలిపారు. పబ్బుపై దాడికి పోలీసులు వెళ్లేసరికి 32 మంది అమ్మాయిలు అసభ్యంగా కనిపించే దుస్తులు ధరించి, అశ్లీల నృత్యాలు చేస్తూ, చట్ట వ్యతిరేకంగా కనిపించారని ఆయన వెల్లడించారు. ఈ పబ్ లో అశ్లీల నృత్యాలపై సమాచారం అందుకుని దాడి చేశామని అన్నారు.
Karnataka
Bengalore
Pub
Arrest
Rescue

More Telugu News